CAT Missing: నా పిల్లి తప్పిపోయింది.. తెచ్చి ఇస్తే 30వేలు ఇస్తా: ఓ మహిళ

ABN , First Publish Date - 2021-07-13T22:05:37+05:30 IST

అల్లారుముద్దుగా పెంచుకుంటున్నతన పిల్లి (జింజర్) తప్పిపోయిందని, ఎవరికైనా కనిపిస్తే..

CAT Missing: నా పిల్లి తప్పిపోయింది.. తెచ్చి ఇస్తే 30వేలు ఇస్తా: ఓ మహిళ

హైదరాబాద్: అల్లారుముద్దుగా పెంచుకుంటున్నతన పిల్లి (జింజర్) తప్పిపోయిందని, ఎవరికైనా కనిపిస్తే.. తెచ్చి ఇచ్చిన వారికి రూ. 30 వేలు ఇస్తామని ఓ మహిళ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పిల్లిని సొంత కిడ్‌లా పెంచుకున్నామని ఎవరికైనా కనిపిస్తే ఈ నెంబర్‌కు 6301559247 కాంటాక్టు చేయాలని ఆమె కోరారు. ఆ పిల్లి మెడికల్ కండిషన్‌లో ఉందని, దానికి వెంటనే చికిత్స చేయాల్సి ఉందని అన్నారు. జూన్ 24న పిల్లి తప్పిపోయిందని, వెతుకుతూనే ఉన్నామని, ఇంత వరకు దాని జాడ తెలియలేదని, చాలా బాధపడుతున్నామని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. సీతారాంబాగ్‌లో ఉన్న యానిమల్ హజ్బండరీకి కూడా ఫిర్యాదు చేశామని ఆమె చెప్పారు.

Updated Date - 2021-07-13T22:05:37+05:30 IST