Advertisement
Advertisement
Abn logo
Advertisement

మది మెచ్చిన మార్జాలం

ఆకట్టుకున్న క్యాట్‌ షో

ఈ పిల్లి ధర రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షలు


హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 5 (ఆంధ్రజ్యోతి): యూఎస్‌ నుంచి వచ్చిన పిల్లి ఇది. బ్రీడ్‌ పేరు మీన్గు. ఆడ పిల్లి పలు వర్ణాలలో ఉంటే, మగపిల్లి సాధారణంగా నలుపు రంగులోనే ఉంటుంది. నగరానికి చెందిన బ్రీడర్‌ మొహమ్మద్‌ బిలాల్‌ వీటిని మొట్టమొదటి సారిగా నగరానికి తీసుకువచ్చి బ్రీడ్‌ చేయడం ఆరంభించాడట. ప్రస్తుతం వీటి ధరలు రూ. 3, 4 లక్షల శ్రేణిలో ఉన్నాయి. మగ పిల్లి వయసు 18 నెలలు అయితే, ఆడపిల్లి వయసు 11-12 నెలల మధ్య ఉంది. చాలా ఫ్రెండ్లీగా ఈ బ్రీడ్‌ ఉంటుందని చెబుతున్నారు బ్రీడర్‌. అరుదైన పిల్లులతో నగరంలో ఆదివారం క్యాట్‌ షో 2021 నిర్వహించింది యానిమల్‌ వెల్ఫేర్‌ అండ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ (వీఎ్‌సఏడబ్ల్యుఆర్‌డీ).  పిల్లుల పట్ల అవగాహన కల్పిస్తూ, దేశీ జాతి పిల్లుల దత్తతను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది. మార్స్‌ పెట్‌కేర్‌, ఫెలైన్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా సహకారంతో మాసాబ్‌ట్యాంక్‌లోని వెట్‌ హోమ్‌ వద్ద ఈ షో నిర్వహించారు. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌ ఎస్‌ రామచందర్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి షో ప్రారంభించారు. కార్యక్రమంలో మార్స్‌పెట్‌కేర్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌ గణేష్‌ రమణి, వీఎ్‌సఏడబ్ల్యుఆర్‌డీ ఫౌండర్‌ డాక్టర్‌ మురళీధర్‌, తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement