Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ స్టిల్‌లో పిల్లులను చూస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే... వైరల్ అవుతున్న దొంగచాటు ఫొటో!

సోషల్ మీడియాలో షేర్ అవుతున్న విచిత్ర ఉదంతాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు అత్యంత వేగంగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలైతే చిన్నాపెద్దా అనే తారతమ్యం లేకుండా అందరూ చూస్తుంటారు. తాజాగా రీడిట్ సోషల్ సైట్ లో షేర్ అయిన ఒక ఫొటో నెటిజన్లను అమితంగా అలరిస్తోంది. 

ఆ ఫోటోలో రెండు పిల్లులు ఎంతో రొమాంటిక్‌గా కనిపిస్తున్నాయి. అవి ఒకదానిని మరొకటి గట్టిగా కావలించుకుని పడుకున్నాయి. ఈ ఫొటోను దొంగచాటుగా తీశారట. ఇప్పటివరకూ ఈ ఫొటోను కొన్ని వేలమంది వీక్షించారు. కొందరు యూజర్లు దీనిని వింతగా చూస్తుండగా, మరికొందరు... పిల్లుల ప్రైవేట్ వ్యవహారాన్ని పబ్లిక్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాంక్ మిమర్ అనే యూజర్ ఈ ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోను చూసిన ఒక యూజర్ ఆ పిల్లులు అన్నాచెల్లెళ్లయి కూడా ఉండవచ్చని కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement