పట్టుకున్న మద్యం మాయం.. ఎస్‌ఐపై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-09-18T17:14:20+05:30 IST

పట్టుకున్న మద్యం బాటిళ్లను మాయం చేసిన అభియోగంపై జంగారెడ్డిగూడెం టౌన్‌..

పట్టుకున్న మద్యం మాయం.. ఎస్‌ఐపై కేసు నమోదు

జంగారెడ్డిగూడెం(పశ్చిమ గోదావరి): పట్టుకున్న మద్యం బాటిళ్లను మాయం చేసిన అభియోగంపై జంగారెడ్డిగూడెం టౌన్‌ ఎస్‌ఐ గంగాధర్‌పై పోలీసులు కేసు నమో దు చేశారు. దీనిపై ఎస్‌ఈబీ ఏఎస్పీ కరీముల్లా షరీఫ్‌ విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్‌ల్లో నమోదుచేసిన కేసులలో ఎన్‌డీపీఎల్‌ లిక్కర్‌ వివరాలను అందించాలని ఆదేశాలు ఇవ్వగా జంగారెడ్డిగూడెం ఇన్‌ చార్జి ఎస్‌హెచ్‌వో రామకృష్ణ సీజ్‌ చేసిన మద్యం సీసాల్లో అవకతవకలు ఉన్నట్లు గుర్తించామన్నారు.


ఇద్దరు ఎస్‌ ఈబీ అధికారులను విచారణకు పంపించి విచారణ జరి పించగా.. ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబరు వరకు పట్టుబడ్డ మద్యం సీసాల్లో 24 సీసాలు మాయం చేసి, వాటి స్థానంలో వేరే సీసాలను ఉంచినట్లు గుర్తించార న్నారు. కేసులకు సంబంధం లేని 51 అనధికార మద్యం బాటిళ్లను గుర్తించినట్లు తెలిపారు. దీనిపై అప్పటి ఎస్‌ఐ గంగాధర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ఏఎస్పీ షరీఫ్‌ తెలిపారు. ఎస్‌ఈబీ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎం.జయరాజు, ఎస్‌ఈబీ సీఐ ధనరాజు, ఎస్‌కే జమా పాల్గొన్నారు. 


అందుకే వీఆర్‌కు..

ఏలూరు: జంగారెడ్డి గూడెం సీఐ కె.నాగేశ్వర నాయక్‌, ఎస్‌ఐ ఎస్‌ఎస్‌ ఆర్‌ గంగాధర్‌లపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు వీరిని వీఆర్‌లో పెట్టినట్లు ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు స్పష్టం చేశారు. గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఐజీ, ఎస్పీ నారాయణ నాయక్‌ విలేకరులతో మాట్లాడారు. వారిద్దరిపైన ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై విచా రించే నిమిత్తం జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కరీముల్లా షరీఫ్‌ వినతితో నూజివీడు డీఎస్పీని విచారణ అధికారిగా నియ మించామన్నారు. ఈ సమయంలో వారు అక్కడ పదవులలో ఉంటే విచారణ పారదర్శకంగా జరగదేమోనని అనుమానాలు కొంతమంది వ్యక్తం చేయడంతో వీఆర్‌లో ఉంచినట్లు చెప్పారు.



Updated Date - 2020-09-18T17:14:20+05:30 IST