Abn logo
Nov 22 2020 @ 12:35PM

సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్‌లపై సీబీఐ దర్యాప్తు

అమరావతి: హైకోర్టు న్యాయమూర్తులను దూషిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్‌లపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు గతంలో లాయర్ లక్ష్మీనారాయణకు లేఖ రాశారు. లేఖతో పాటు సోషల్ మీడియా పోస్టింగ్‌లు  లక్ష్మీనారాయణ అందజేశారు. లేఖ ఆధారంగా రిజిస్ట్రార్ జనరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా విచారణను ప్రభుత్వం సీఐడీకి బదలాయించింది. సీఐడీ విచారణ పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసి కేసును సీబీఐకి అప్పగించింది. సీబీఐ విచారణకు హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ హాజరైయారు. సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టినవారిని కాపాడుకుంటామని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీబీఐ విచారించాలని లక్ష్మీనారాయణ సూచించారు. ఈ కేసులో విజయసాయి, సురేష్, తమ్మినేని, ఎమ్మెల్సీ రవీంద్ర, మంత్రి నారాయణస్వామి, ఆమంచిని సీబీఐ విచారించే అవకాశం ఉంది. 

Advertisement
Advertisement