సీబీఐ దాడులు...Pearl Group scamలో మరో 11 మంది అరెస్ట్

ABN , First Publish Date - 2021-12-23T16:11:30+05:30 IST

పెరల్ గ్రూప్ స్కాం కేసులో మరో 11 మంది నిందితులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)...

సీబీఐ దాడులు...Pearl Group scamలో మరో 11 మంది అరెస్ట్

న్యూఢిల్లీ: పెరల్ గ్రూప్ స్కాం కేసులో మరో 11 మంది నిందితులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) గురువారం అరెస్ట్ చేసింది. పెరల్ గ్రూప్ దేశవ్యాప్తంగా 5 కోట్లమంది డిపాజిటర్ల నుంచి రూ.60,000 కోట్ల డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసింది. చట్టబద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా పెరల్ గ్రూప్ పెట్టుబడులను ప్రజల నుంచి స్వీకరించి మోసగించిందని సీబీఐ విచారణలో తేలింది.ఈ స్కాంలో నిందితులైన చందర్ భూషణ్ థిల్లాన్, ప్రేమ్ సేథ్, మన్ మోహన్ కమల్ మహాజన్, మోహన్ లాల్ సెహజ్ పాల్, కన్వల్ జిత్ సింగ్ తూర్, ఢిల్లీ, చంఢీఘడ్, కోల్ కతా, భువనేశ్వర్ నగరాలకు చెందిన వ్యాపారవేత్తలు ప్రవీణ్ కుమార్ అగర్వాల్, మనోజ్ కుమార్, ఆకాష్ అగర్వాల్, అనిల్ కుమార్ ఖేమ్కా, సుభాష్ అగర్వాల్, రాజేష్ అగర్వాల్ లను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశంతో సీబీఐ పెరల్ గ్రూప్ కుంభకోణంపై దర్యాప్తు చేసింది. గతంలో పెరల్ గ్రూప్ నకు చెందిన నిర్మల్ సింగ్ భంగో, సుఖదేవ్ సింగ్, సుబ్రతా భట్టాచార్య, గుర్మిత్ సింగ్‌లను అరెస్ట్ చేశారు. ఈ స్కాంతో సంబంధమున్న వారిని కూడా తాజాగా సీబీఐ అరెస్ట్ చేసింది. 


Updated Date - 2021-12-23T16:11:30+05:30 IST