Abn logo
May 8 2021 @ 03:42AM

బెయిల్‌ రద్దు కేసులో.. కౌంటర్‌ దాఖలుకు జగన్‌కు గడువు

సీబీఐ కోర్టు విచారణ 17కి వాయిదా

హైదరాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు,  ఏపీ సీఎం  జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలనే వ్యాజ్యంలో కౌం టర్‌ దాఖలుకు మరింత సమయమివ్వాలని ఆయన సీబీఐ ప్రత్యేక కోర్టును అభ్యర్థించారు. న్యాయస్థానం అందుకు అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. బెయిల్‌ రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్‌ దాఖలు చేయడం, దానిని విచారణకు స్వీకరించిన కోర్టు.. జగన్‌, సీబీఐలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యం శుక్రవారం న్యాయమూర్తి బీఆర్‌ మధుసూదన్‌రావు ఎదుట మరోసారి విచారణకు వచ్చింది. కోర్టు నోటీసులు అందాయని, కౌంటర్‌ దాఖలుకు సమయం కావాలని జగన్‌ తరఫు న్యాయవాది.జి.అశోక్‌రెడ్డి కోరడంతో అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ కూడా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. 

Advertisement
Advertisement
Advertisement