Jagan బెయిల్ రద్దు కేసు.. సీబీఐకి మరో అవకాశమిచ్చిన కోర్టు

ABN , First Publish Date - 2021-07-14T19:07:53+05:30 IST

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. సీబీఐ లిఖితపూర్వక వాదనలు సమర్పించక పోవడాన్ని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు.

Jagan బెయిల్ రద్దు కేసు.. సీబీఐకి మరో అవకాశమిచ్చిన కోర్టు

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. సీబీఐ లిఖితపూర్వక వాదనలు సమర్పించక పోవడాన్ని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కౌంటర్ ధాఖలు చేయడానికి 10 రోజులు గడువు కావాలని సీబీఐ కోరింది. ఇప్పటికే సీబీఐ అధికారులకు రెండు దఫాలు అవకాశమిచ్చారని, ఇప్పుడు మరో అవకాశం ఇవ్వొద్దని కోర్టుకి తెలిపారు పిటిషనర్. సీబీఐ అనేది దర్యాప్తు సంస్థ కాబట్టి చివరిగా ఒకసారి అవకాశం ఇస్తున్నామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను 26కి వాయిదా వేసింది. 



జగన్‌పై ఉన్న కేసుల్లో సాక్షులు, నిందితులుగా ఉన్న అధికారులు ప్రస్తుతం ఏపీలో మంచి హోదాలో పని చేస్తున్నారని వారిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏపీ సీఎం ప్రభావితం చేసే అవకాశం ఉందని లిఖిత పూర్వక వాదనల్లో పిటిషనర్ తెలిపారు. గతంలో ఐఏఎస్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌ను ఏపీ సీఎం వేధింపులకు గురిచేశాడని.. అలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల ట్రాక్ రికార్డ్ చూడాల్సిన బాధ్యత సీఎస్ పరిధిలో ఉంటుందని, కానీ ప్రత్యేక జీవో ద్వారా సీఎం జగన్ ఆ అధికారులను బదిలీ చేసుకున్నారన్నారు. దీంతో సాక్షులుగా ఉన్న అధికారులను పరోక్షంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని, ముమ్మాటికి ఏపీ సీఎంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి బెయిల్ షరతులను ఉల్లగించారన్నారు. 

Updated Date - 2021-07-14T19:07:53+05:30 IST