జగన్, విజయసాయి బెయిల్ రద్దుపై మరికాసేపట్లో తీర్పు

ABN , First Publish Date - 2021-09-15T15:26:51+05:30 IST

ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై బుధవారం తీర్పు వెలువడనుంది.

జగన్, విజయసాయి బెయిల్ రద్దుపై మరికాసేపట్లో తీర్పు

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై బుధవారం తీర్పు వెలువడనుంది. ఎంపీ రఘురామ కృష్ణం రాజు దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు పూర్తి అయ్యాయి. దీంతో నాంపల్లి సీబీఐ కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. ఇక బెయిల్ రద్దు పిటిషన్‌ను మరో న్యాయస్థానానికి మార్చాలన్న రఘురామ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. 


అక్రమాస్తుల కేసులో ఏ1గా ఉన్న జగన్, ఏ2గా ఉన్న విజయసాయి బెయిల్‌ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై సీబీఐ కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. పిటిషనర్ రిజాయిండర్లు, జగన్ కౌంటర్లతో వాదోపవాదనలు కొనసాగాయి. జగన్ సహ విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్లపై వాదనలు ముగిసాయి. దీంతో న్యాయస్థానం ఇవాళ తీర్పును వెల్లడించనుంది. సీబీఐ తీర్పుపై ఇటు తెలుగు ప్రజల్లో, వైసీపీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 


కాగా.. వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది. ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్‌ బెయిల్‌ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్‌ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు. బెయిల్‌ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-09-15T15:26:51+05:30 IST