సుశాంత్ ఆత్మహత్య కేసులో సీబీఐ తాజా ప్రకటన

ABN , First Publish Date - 2021-06-14T20:49:44+05:30 IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుపై సీబీఐ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో పరిశోధన కొనసాగుతోందని..

సుశాంత్ ఆత్మహత్య కేసులో సీబీఐ తాజా ప్రకటన

ఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుపై సీబీఐ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో పరిశోధన కొనసాగుతోందని.. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ప్రకటనలో పేర్కొంది. సుశాంత్ మరణించి ఇవాళ్టితో ఏడాది. 

ఇదిలా ఉంటే, సుశాంత్ ప్రథమ వర్ధంతి సందర్భంగా అభిమానులు, స్నేహితులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. నెట్టింట అక్షరాంజలి ఘటిస్తున్నారు. సుశాంత్ 2020 జూన్ 14న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. 34 ఏళ్ల సుశాంత్ కేసును ముంబై పోలీసులతో పాటు బీహార్ పోలీస్, సీబీఐ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా, హత్య చేశారా అన్న కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితో సహా పలువురిని విచారించారు. ఏడాదిగా ఎన్నో మలుపులు తిరుగుతున్న ఈ కేసు మిస్టరీ ఇప్పటికీ వీడలేదు.  



Updated Date - 2021-06-14T20:49:44+05:30 IST