పాంజీ స్కామ్‌లో తృణమూల్ మంత్రిని ప్రశ్నించిన సీబీఐ

ABN , First Publish Date - 2021-09-14T15:55:04+05:30 IST

ఐ-కోర్ చిట్ ఫండ్ స్కామ్‌లో తృణమూల్ కాంగ్రెస్ నేత, పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కోల్‌కతాలోని

పాంజీ స్కామ్‌లో తృణమూల్ మంత్రిని ప్రశ్నించిన సీబీఐ

కోల్‌కతా: ఐ-కోర్ చిట్ ఫండ్ స్కామ్‌లో తృణమూల్ కాంగ్రెస్ నేత, పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కోల్‌కతాలోని ఆయన కార్యాలయంలో ప్రశ్నించింది. ఐ-కోర్ నిర్వహించిన కొన్ని కార్యక్రమాల్లో ఛటర్జీ పాల్గొనడంతో ఆయనకు సీబీఐ గత ఏప్రిల్‌లో సమన్లు జారీ చేసింది. ఐ-కోర్ చిట్ ఫండ్ కంపెనీ తన డిపాజిటర్లను మోసం చేసినట్లు కేసు నమోదైంది. పెట్టుబడి పెట్టినవారికి అనేక రెట్లు లాభాలు ఇస్తామని నమ్మించి మోసం చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి.


కాగా, ఐ-కోర్ కంపెనీకి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకునేందుకు సీబీఐ తన కార్యాలయానికి వచ్చిందని, తనకు తెలిసిన విషయాలు తప్పనిసరిగా సీబీఐ టీమ్‌తో పంచుకుంటానని తాను చెప్పానని మీడియాకు ఛటర్జీ తెలిపారు. మరోవైపు, పాంజీ స్కామ్‌పై బీజేపీ నేత, ఎంపీ రాజు బిస్తా స్పందిస్తూ, పశ్చిమబెంగాల్ ప్రజలను నమ్మించి కోట్లాది రూపాయల మేరకు వంచన చేసిన వ్యక్తులు పాంజీ స్కామ్‌కు బాధ్యత వహించాలన్నారు. సీబీఐ, ఈడీ దాడుల్లో పట్టుబడిన వ్యక్తులు వాటిని ప్రతీకార దాడులుగానూ, రాజకీయ దాడులుగా పోల్చడం ఆశ్చర్యకరమని, దోషులకు శిక్ష పడాలని అన్నారు.

Updated Date - 2021-09-14T15:55:04+05:30 IST