ఎస్బీఐ కుంభకోణం కేసులో సీబీఐ దాడులు

ABN , First Publish Date - 2020-12-05T14:10:52+05:30 IST

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.1800 కోట్ల కుంభకోణం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు ఢిల్లీలోని మూడు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు చేశారు....

ఎస్బీఐ కుంభకోణం కేసులో సీబీఐ దాడులు

న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.1800 కోట్ల కుంభకోణం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు ఢిల్లీలోని మూడు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు చేశారు. రూ.1800 కోట్ల ఎస్బీఐ కుంభకోణం కేసు నమోదు చేసిన సీబీఐ ఢిల్లీలోని లజపతినగర్ లోని ఓ ప్రైవేటు కంపెనీపై దాడి చేసి తనిఖీలు జరిపింది. ఈ కుంభకోణంపై లజపతినగర్ లోని ఓ కంపెనీ డైరెక్టరు, గ్యారంటీర్ , మరికొందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఎస్బీఐను 1800 కోట్ల రూపాయల మేర రుణాలు తీసుకొని వాటిని దారి మళ్లించారని దర్యాప్తులో తేలింది. ఢిల్లీలో మోసగించిన కంపెనీతోపాటు డైరెక్టర్ల  ఇళ్లపై సీబీఐ దాడులు జరిపింది. 

Updated Date - 2020-12-05T14:10:52+05:30 IST