ధన్‌బాద్ జడ్జి కేసుపై హైకోర్టుకు సీబీఐ రిపోర్ట్

ABN , First Publish Date - 2021-08-20T01:31:34+05:30 IST

జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసు దర్యాప్తు నివేదికను

ధన్‌బాద్ జడ్జి కేసుపై హైకోర్టుకు సీబీఐ రిపోర్ట్

న్యూఢిల్లీ : జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసు దర్యాప్తు నివేదికను సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) గురువారం ఆ రాష్ట్ర హైకోర్టుకు సమర్పించింది. దర్యాప్తు వివరాలతో స్టేటస్ రిపోర్డును ప్రతి వారం హైకోర్టుకు సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై సుప్రీంకోర్టు, హైకోర్టు స్వీయ విచారణ జరుపుతున్నాయి. 


రాంచీలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి హైకోర్టు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో నిందితుల మూత్ర నమూనాలను పరీక్షించడంలో విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 


ధన్‌బాద్ అదనపు జిల్లా సెషన్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ జూలై 28న తన నివాసం నుంచి మోర్నింగ్ వాక్‌కు వెళ్ళినపుడు అనుమానాస్పద రోడ్డు ప్రమాదం జరిగింది. గాయపడిన ఆయనను ఓ వ్యక్తి ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ, ఫలితం దక్కలేదు. ఆయన ప్రాణాలు కోల్పోయారు. 


ఈ కేసులో ముఖ్యమైన సమాచారాన్ని తెలిపినవారికి రూ.5 లక్షలు బహుమతి ఇస్తామని సీబీఐ ప్రకటించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించక ముందు జార్ఖండ్ పోలీసులు దర్యాప్తు చేశారు. జడ్జిని  ఆటోతో ఢీకొట్టినవారు లఖన్ కుమార్ వర్మ, రాహుల్ వర్మ అని గుర్తించి, ఓ ఆటోను స్వాధీనం చేసుకుని, ఆ ఇద్దర్నీ అరెస్టు చేశారు. 


Updated Date - 2021-08-20T01:31:34+05:30 IST