వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం

ABN , First Publish Date - 2022-02-21T21:45:19+05:30 IST

వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. కొంతకాలం గ్యాప్ తర్వాత పులివెందులలో సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు.

వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం

కడప: వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. కొంతకాలం గ్యాప్ తర్వాత పులివెందులలో సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు. వివేకా కేసు అప్రూవర్‌గా మారిన దస్తగిరిని పులివెందుల కోర్టులో సీబీఐ హాజరుపర్చింది. మరోసారి దస్తగిరి వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు నమోదు చేస్తున్నారు. గతేడాది ఆగస్ట్‌ 31న ప్రొద్దుటూరు కోర్టులో దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. ఇటీవల వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చింది. 2019 మార్చి 15న వివేకా తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తన తండ్రి హత్య కేసులో సిట్‌ విచారణలో పురోగతి లేదని, సీబీఐకి అప్పగించాలని కోరుతూ వివే కా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించారు. దస్తగిరిని అప్రూవర్‌గా పరిగణించడాన్ని హైకోర్టు ఆమోదించిన విషయం తెలిసిందే. దీనిపై గతంలో కడప చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఇచ్చిన తీర్పును సమర్థించింది. కడప కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ నిందితులు ఎర్ర గంగిరెడ్డి, జి.ఉమాశంకర్‌ రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది. 

Updated Date - 2022-02-21T21:45:19+05:30 IST