అక్టోబర్ 10 కంటే ముందే ఇంటర్ ఫలితాలు.. సుప్రీంకు తెలిపిన సీబీఎస్ఈ..

ABN , First Publish Date - 2020-09-24T20:40:47+05:30 IST

విద్యార్ధుల ప్రయోజనాల దృష్ట్యా అక్టోబర్ 10 లేదా అంతకంటే ముందే 12వ తరగతి...

అక్టోబర్ 10 కంటే ముందే ఇంటర్ ఫలితాలు.. సుప్రీంకు తెలిపిన సీబీఎస్ఈ..

న్యూఢిల్లీ: విద్యార్ధుల ప్రయోజనాల దృష్ట్యా అక్టోబర్ 10 లేదా అంతకంటే ముందే 12వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షా ఫలితాలు విడుదల చేస్తామని సీబీఎస్ఈ ఇవాళ సుప్రీంకోర్టుకు వెల్లడించింది. మరోవైపు యూజీసీ సైతం వచ్చే నెల 31 నుంచే డిగ్రీ కోర్సుల కోర్సుల కోసం అకడమిక్ క్యాలెండర్‌ను ప్రారంభిస్తామని యూజీసీ సైతం సుప్రీం ధర్మాసనానికి తెలిపింది. ఆ సమయానికల్లా మళ్లీ పరీక్షలు రాసిన దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫలితాలు వెలువడతాయని పేర్కొంది. ఈ విద్యా సంవత్సరం వృధా కాకుండా తాము కలిసికట్టుగా పనిచేస్తామంటూ ప్రకటించిన కొద్ది రోజులకే యూజీసీ, సీబీఎస్ఈలు ఈ మేరకు పేర్కొనడం గమనార్హం.


ఇంటర్ ద్వితీయ సంవత్సరం కంపార్ట్‌మెంట్ పరీక్షలు రాసిన వారికి కూడా కొత్త విద్యా సంవత్సరంలో చేరే విధంగా అవకాశం కల్పిస్తామని రెండు బోర్డులూ చెప్పాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా 12వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షా ఫలితాలు విడుదల చేయాలని అటు సీబీఎస్ఈకి.. కాలేజీల్లో వీరికి ప్రవేశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అటు యూజీసీకి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ప్రస్తుతం కొవిడ్-19 కల్లోలం కారణంగా అనుకోని పరిస్థితులు ఎదురవుతున్నందున.. అధికారులు విద్యార్థులకు తోడ్పాటు అందించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ ఏడాది 12వ తరగతి కంపార్ట్‌మెంటు పరీక్షలు రాసిన విద్యార్ధులకు విద్యా సంవత్సరం వృధా కాకుండా చూడాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషన్ మేరకు జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్ ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. 

Updated Date - 2020-09-24T20:40:47+05:30 IST