లింగసముద్రం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో త్వరలో సీసీ కెమేరాలు ఏర్పాటు

ABN , First Publish Date - 2021-04-16T05:31:38+05:30 IST

లింగసముద్రం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పలు గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఎస్సై ఎస్‌.రమేష్‌ గురువారం చెప్పారు.

లింగసముద్రం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో   త్వరలో సీసీ కెమేరాలు ఏర్పాటు

లింగసముద్రం, ఏప్రిల్‌ 15 : లింగసముద్రం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పలు గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఎస్సై ఎస్‌.రమేష్‌ గురువారం చెప్పారు.  లింగసముద్రంలోని తిరుమణిశెట్టి కోటయ్య సమాధి వద్ద 3, బస్టాండ్‌ సెంటర్‌లో 2, పెంట్రాలలోని తాతాహోటల్‌ వద్ద 2, రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద 2, మొగిలిచెర్ల బస్టాండ్‌ సెంటర్‌లో 2, వీఆర్‌కోట బస్టాండ్‌ సెంటర్‌లో 2, వెంగళాపురం బస్టాండ్‌ సెంటర్‌లో 2 ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు. అయితే ఈ కెమెరాలను 16 ప్రదేశాల్లో ఏర్పాటు చేయనున్నామన్నారు. మరో 16 ప్రదేశాల్లో ఏర్పాటు చేసేందుకు వీలుందన్నారు. లింగసముద్రంలోని కేబుల్‌ ఆపరేటర్‌ ఈ కెమెరాలకు ఉచితంగా లీడ్‌(పోలీసు స్టేషన్‌ నుంచి కెమెరాలను పర్యవేక్షించే సహకారం) ఇస్తామని ముందుకు వచ్చారన్నారు. ఈ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణ, కేసుల ఛేదన తేలిక అవుతుందన్నారు. కొందరు వ్యక్తులు తన పేరు చెప్పి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అలాంటి వారికి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామన్నారు.

Updated Date - 2021-04-16T05:31:38+05:30 IST