రెడ్‌జోన్లలో సీసీ కెమెరాలు.. డీజీపీ ఆదేశాలు

ABN , First Publish Date - 2020-04-09T17:14:45+05:30 IST

రెడ్‌ జోన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశించారు. బుధవారం గుంటూరులోని మంగళ దాస్‌నగర్‌, పాతగుంటూరు కుమ్మరిబజారు

రెడ్‌జోన్లలో సీసీ కెమెరాలు.. డీజీపీ ఆదేశాలు

గుంటూరులో డీజీపీ ఆకస్మిక పర్యటన ఫ అధికారులకు సూచనలు 

గుంటూరు (ఆంధ్రజ్యోతి): రెడ్‌ జోన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశించారు. బుధవారం గుంటూరులోని మంగళ దాస్‌నగర్‌, పాతగుంటూరు కుమ్మరిబజారు ప్రాంతాల్లో డీజీపీ ఆకస్మికంగా పర్యటించి ఏర్పాట్ల ను పరిశీలించారు. అనంతరం పోలీస్‌ కార్యాలయంలో డీజీపీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి అధికార యంత్రాం గం తీసుకుంటున్న చర్యలపై సంతృప్తివ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఢిల్లీ కాంటాక్ట్స్‌ ద్వారా విస్తరించిన కరోనా వైరస్‌ సాధారణ ప్రజల్లోకి చేరకుండా కట్టడి చేయాలన్నారు. 24 గంటలు రోడ్లపై ఉంటూ  విధులు నిర్వహిస్తున్న పోలీ సులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరింత కష్టపడితే వైరస్‌ను పూర్తిగా నియంత్రించవచ్చన్నారు.  జిల్లాలో ఇప్పటి వరకు 581 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు పోలీసులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారన్నారు. ఐజీ ప్రభాకరరావు మాట్లాడు తూ పాజిటివ్‌ కేసులను విచారించే సమయంలో ఖచ్చితత్వం ఉండాలన్నారు. అర్బన్‌ పోలీస్‌ అధికారి, డీఐజీ రామకృష్ణ మాట్లాడుతూ కంటైన్మెంట్‌ ఏరియాల్లో వై ఫైవ్‌తో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో అదనపు డీజీ త్రిపాటి ఉజాల, రూరల్‌ ఎస్పీ విజయరావు, కమిషనర్‌ అనురాధ, జేసీ దినేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-04-09T17:14:45+05:30 IST