కుంభకోణంపై కాలయాపన

ABN , First Publish Date - 2020-11-18T05:30:00+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీసీఐ కుంభకోణంలో ఏడాదిన్నర క్రితం దర్యాప్తు నివేదిక అందినా అక్రమార్కులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం జంకుతోంది.

కుంభకోణంపై కాలయాపన
గుంటూరు యార్డులో సీబీఐ అధికారుల తనిఖీలు (పాతచిత్రం)

సీసీఐ అవకతవకలపై చర్యలు శూన్యం 

నాలుగేళ్ల క్రితం నాటి అక్రమాలపై మౌనం

19 మందిని దోషులుగా తేల్చినా పట్టించుకోని పాలకులు

సీబీఐ విచారణతో  అక్రమార్కుల గుట్టురట్టు


రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీసీఐ కుంభకోణంలో ఏడాదిన్నర క్రితం దర్యాప్తు నివేదిక అందినా అక్రమార్కులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం జంకుతోంది. ఈ కుంభకోణంపై పార్లమెంటు, శాసనసభ, శాసనమండలిలో పెద్ద ఎత్తున చర్చ జరి గింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేయాలని 2017 నవంబరు 12న కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ను నియమించింది. ఈ కుంభకోణంలో మార్కెటింగ్‌ శాఖ కు చెందిన జేడీలు, డీడీలు, ఏడీలు, యార్డు కార్య దర్శులు మొత్తం 19 మందిని కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వరీస్‌ అధికా రులు గుర్తించారు. కుంభకోణంలో ఉన్నవారిలో ఇప్పటికే సుమారు 20 మంది ఉద్యోగ విరమణ చేయ గా, కొందరు చనిపోయారు. మరోవైపు విశాఖ సీబీఐ, హైకోర్టులలో దీనిపై కేసులు కొనసాగుతున్నాయి.  


గుంటూరు, నవంబరు 15 (ఆంధ్రజ్యో తి): రాష్ట్ర విభజన తరువాత 2014-15లో ఏపీలో సీసీఐ పత్తి కొనుగోళ్లలో గుంటూ రు కేంద్రంగా పెద్దఎత్తున అవకతవకలు జరిగాయి. ఇందుకు సంబంధించి   మార్కెటింగ్‌ శాఖలో 97 మందికి షోకాజ్‌ నోటీసులిచ్చి, 28 మందిని సస్పెండ్‌ చేశా రు. కుంభకోణంలో 19 మంది ప్రమేయం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినకమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌లో నిర్దారించి 2019 ఫిబ్రవరి 22న నివేదిక అందజేశారు. దర్యాప్తు నివేదిక ప్రకారం చర్యలను ఉపసంహరించుకోవాలని వారు చేస్తున్న ప్రయత్నాలు  ఫలించ డంలేదు. పత్తి కొనుగోళ్లలో దళారులు, మార్కెటింగ్‌ అధికారులు, ఉద్యోగులు, సీసీఐ బయ్యర్లు సిండికేటయ్యారని విచారణలో తేలింది. రైతుల నుంచి దళారులు క్వింటా రూ.3 వేల నుంచి రూ.3,500కు కొనుగోలుచేసి అదే పత్తిని మార్కెట్‌ యార్డుల ద్వారా సీసీఐ కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టించారు. జిన్నింగ్‌ మిల్లులు కేంద్రాలుగా ఈ వ్యవహారం సాగింది. దళారులకు క్వింటాల్‌కు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు మేలు జరిగింది.


సీబీఐ విచారణతో అక్రమాలు వెలుగులోకి...


అప్పటి కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కడప జిల్లాలో ఓ రైతు రూ.కోటి పత్తిని అమ్మినట్లు రికార్డు లు సృష్టించి చెక్కులు ఇచ్చారు. పల్నాడు కు చెందిన ఓ వ్యాపారి పేరుతో కృష్ణా జిల్లాలోని మార్కెట్‌ యార్డులో వంద చెక్కులు ఇచ్చారు. గుంటూరు యార్డులో వెంకాయమ్మ అనే మహిళా రైతు 50 సార్లు భర్త పేరుమార్చి పత్తి అమ్మినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. రాయల సీమలో పత్తి బదులు ముడిపత్తి కొను గోలు చేసి జిన్నింగ్‌ చేసినట్లు చూపించా రు. యార్డుల్లో హమాలీలకు ఇచ్చే సొ మ్ము మార్కెటింగ్‌ అధికారులు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలలో జమ చేశారని విచా రణలో తేల్చారు. రాష్ట్రంలోని 43 కేంద్రా లలో సుమారు 94 లక్షల క్వింటాళ్ళ పత్తి ని కొనుగోలు చేయగా ఇందుకు సంబంఽ దించి గుంటూరు రింగ్‌రోడ్డు, లక్ష్మీపురం లోని రెండు జాతీయ బ్యాంకుల్లో చెక్కులు ఇచ్చారు. ఆ రెండు బ్యాంకుల్లో సీసీఐ అధికారులు ఇచ్చిన చెక్కులను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకుని విచారణ జరిపారు. ఏడు మార్కెట్‌ యార్డుల్లో సీబీఐ అధికారులు కొనుగోళ్ల రికార్డులను పరిశీలించారు. మిగిలిన యార్డు ల్లో కూడా సీబీఐ దర్యాప్తు చే యాలని రైతుసంఘాలు హై కోర్టులో ప్రజాప్రయోజ నాల కేసు వేశాయి. రాష్ట్ర విజిలెన్స్‌ అధికారులు సుమారు పది మార్కెట్‌ యార్డుల్లో వివరాలు సేకరించారు. సీబీఐ ద ర్యాప్తుతో సీసీఐ ముంబై అధికారులు గుంటూరు లోని అప్పటి జీఎం,    ముగ్గురు బయ్యర్లను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేశారు. కుంభకోణంలో 90- 95 శాతం మార్కెటింగ్‌ శాఖ వైఫల్యం అని సీబీఐ అధికారులు తేల్చారు.  రైతుల బ్యాంకు ఖాతాలకు డబ్బు జమ చేయకుండా చెక్కులు ఇవ్వటంతో దళా రుల పనిసులవైందని సీబీఐ గుర్తించింది. 



మౌనం వహిస్తున్న పాలకులు


అప్పట్లో ప్రతి పక్షంలో ఉన్న నేతలు ఈ కుంభకోణంపై దుమ్మెత్తి పోశారు. అప్పట్లో ప్రతిపక్షాలు అసెంబ్లీలో ఈ కుంభకోణంపై ధ్వజమెత్తారు. ప్రస్తుతం వారు మౌనంగా ఉంటున్నార ని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ కుంభకోణంలో బాధ్యులపై ఏ చర్యలూ తీసుకోక పోగా కేసును మూసి వేయాలని ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నా యి. ఏడాదిన్నర నుంచి కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ స్‌ ఫైల్‌ను క్లియర్‌ చేయలేదు. ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఓ అధికారి  అక్రమార్కు లను కాపాడటానికి రంగంలోకి దిగినట్లు తెలిసింది.  

Updated Date - 2020-11-18T05:30:00+05:30 IST