కరోనాకు మాతృకలు గబ్బిలాలే: సీసీఎంబీ

ABN , First Publish Date - 2021-06-15T10:01:06+05:30 IST

‘కరోనా వైరస్‌ వూహాన్‌ ల్యాబ్‌ నుంచే లీకైంది’ అంటూ ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) సలహాదారు డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా కీలక

కరోనాకు మాతృకలు గబ్బిలాలే: సీసీఎంబీ

హైదరాబాద్‌, జూన్‌ 14 : ‘కరోనా వైరస్‌ వూహాన్‌ ల్యాబ్‌ నుంచే లీకైంది’ అంటూ ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) సలహాదారు డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌-19 ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్న కరోనా వైర్‌సకు, గబ్బిలాల్లోని కరోనా వైర్‌సలకు దగ్గరి పోలికలు ఉన్నాయన్నారు. ఈ రెండు కూడా జన్యుపరంగా 96 శాతం మేర ఒకేవిధం గా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈనేపథ్యంలో కరోనా వైరస్‌ ల్యాబ్‌ నుంచే లీకైందనే వాదన సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. గబ్బిలాల నుంచి జంతువులకు, వాటి ద్వారా మనుషులకు వైరస్‌ సంక్రమించి ఉండొచ్చన్నారు. 

Updated Date - 2021-06-15T10:01:06+05:30 IST