Abn logo
Jun 11 2021 @ 04:37AM

మా 900 కోట్లు మాకివ్వండి: సీసీఎస్‌

సీసీఎస్‌ పేరిట ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టి ఆర్టీసీ రూ.900 కోట్లు వాడుకుందని, తమ డబ్బును తమకు బదలాయించేలా చూడాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను ఆర్టీసీ ఉద్యోగుల క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ (సీసీఎస్‌) పాలకవర్గం కోరింది. ఈ మేరకు గురువారం మంత్రికి లేఖ రాసింది. ఉద్యోగుల వేతనాల నుంచి 1ు చొప్పున ప్రతి నెలా మినహాయించే రూ.40 కోట్లను సీసీఎ్‌సకు బదలాయించాల్సి ఉంటుందని వివరించింది. ఈ మొత్తం నుంచి  సీసీఎ్‌సలో సభ్యులైన ఉద్యోగుల పిల్లల చదువులు, ఇళ్ల నిర్మాణం కోసం రుణాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. కానీ, ఆర్టీసీ సొమ్మును బదలాయించకపోవడం వల్ల రెండేళ్ల నుంచి ఉద్యోగులకు రుణాలు ఇవ్వలేకపోతున్నామని వాపోయింది. 

Advertisement