నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు దోహదపడతాయి

ABN , First Publish Date - 2021-09-19T05:33:04+05:30 IST

సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చునని ఖమ్మం రూరల్‌ ఏసీపీ సోమా వెంకటరెడ్డి అన్నారు.

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు దోహదపడతాయి

ఖమ్మం రూరల్‌  ఏసీపీ సోమా వెంకటరెడ్డి 

ముదిగొండ,సెప్టెంబరు18: సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చునని ఖమ్మం రూరల్‌  ఏసీపీ సోమా వెంకటరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని మేడేపల్లి గ్రామంలో రూ.1.50లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏసీపీ వెంకటరెడ్డి ఎంపీపీ సామినేని హరిప్రసాద్‌తో కలిసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలు జరుగకుండా నియంత్రించవచ్చునని సూచించారు. అలాగే వాహనాల రాకపోకలను, అసాంఘీక కార్యకలాపాలను అరికట్టడం లోనూ సీసీ కెమెరాలు ముఖ్యపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో ఖమ్మం రూరల్‌ సీఐ సత్యనారాయణరెడ్డి, సర్పంచ్‌ సామినేని రమేష్‌, ఎస్‌ఐ నరేష్‌, ఉపసర్పంచ్‌ భయ్యం రమేష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-09-19T05:33:04+05:30 IST