ఆ దేశానికి వెళ్లకండి.. పౌరులకు అమెరికా సూచన

ABN , First Publish Date - 2022-01-12T21:25:19+05:30 IST

దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్.. ప్రపంచాన్ని కలవరపెడుతోంది. రికార్డు స్థాయిలో ప్రజలు కొవిడ్ బారినపడుతుండటంతో ప్రపంచ దేశాలు భయాందోళలనలకు

ఆ దేశానికి వెళ్లకండి.. పౌరులకు అమెరికా సూచన

ఎన్నారై డెస్క్: దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్.. ప్రపంచాన్ని కలవరపెడుతోంది. రికార్డు స్థాయిలో ప్రజలు కొవిడ్ బారినపడుతుండటంతో ప్రపంచ దేశాలు భయాందోళలనలకు గురవుతున్నాయి. ఈ క్రమంలోనే కరోనా నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే అమెరికా పౌరులకు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తాజాగా కీలక సూచన చేసింది. పక్కనే ఉన్న కెనడాకు వెళ్లొద్దని తెలిపింది. కొవిడ్ ఉధృతి ఎక్కువగా ఉన్నందువల్లే కెనడా ప్రయాణం మానుకోవాలని సూచించినట్టు పేర్కొంది. 



ఇదిలా ఉంటే.. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ సైతం ట్రావెల్ అడ్వైజరీలో కీలక సవరణలు చేసింది. లెవెల్ ఫోర్ (ప్రయాణించడానికి వీల్లేని) దేశాల జాబితాలో చేర్చింది. కెనడాకు ప్రయాణ ప్రయత్నాలను విరమించుకోవాలని తెలిపింది. కాగా.. మర్చి 2020లో కెనడాతో అమెరికా తన భూ సరిహద్దులను మూసేసింది. అయితే పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్న పౌరులను అనుమతించే క్రమంలో గత నవంబర్‌లో ఆంక్షలను ఎత్తేసింది. తాజాగా ఒమైక్రాన్ కలవరపెడుతున్న నేపథ్యంలో లెవల్ ఫోర్ దేశాల జాబితాలో  కెనడాను చేర్చింది. 




Updated Date - 2022-01-12T21:25:19+05:30 IST