ఆ 22దేశాలకు కూడా వెళ్లొద్దు.. దేశ పౌరులను హెచ్చరించిన America

ABN , First Publish Date - 2022-01-19T22:54:06+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మరి కరాళ నృత్యం చేస్తోంది. దీంతో భారీ మొత్తంలో ప్రజలు కొవిడ్ బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ పౌరులకు అమెరికా హెచ్చరికలు జారీ

ఆ 22దేశాలకు కూడా వెళ్లొద్దు.. దేశ పౌరులను హెచ్చరించిన America

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మరి కరాళ నృత్యం చేస్తోంది. దీంతో భారీ మొత్తంలో ప్రజలు కొవిడ్ బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ పౌరులకు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. 22 దేశాలకు ఎట్టిపరిస్థితుల్లో వెళ్లొద్దని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



అమెరికాలో కొవిడ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది మంది కొవిడ్ బారినపడుతున్నారు. వేలాది మంది మహమ్మారితో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు రూపొందిస్తూ అందర్నీ అప్రమత్తం చేసే సీడీసీ (సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే 80కిపైగా దేశాలను లెవల్ 4 (వెరీ హై రిస్క్ జోన్) దేశాల జాబితాలో చేర్చిన సీడీసీ.. మరో 22 దేశాలను అందులో చేర్చినట్టు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రకటించింది. లెవల్ 4 దేశాల జాబితాలోకి చేరిన దేశాలకు అస్సలు ప్రయాణించ్చొద్దంటూ ప్రజలను హెచ్చరించింది. కాగా.. సీడీసీ లెవల్ 4 దేశాల జాబితాలో కొత్తగా చేరిన దేశాలను ఒకసారి పరిశీలిస్తే.. ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, ఈజిప్ట్, ఖతార్, బహ్రెయిన్, ఫ్రాన్స్, కెనడా, అరెజ్జింటీనా, టర్కీ, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, బ్రిటన్, ఉరుగ్వే, పనామా తదితర దేశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. దేశ ప్రజలందరూ కొవిడ్ టీకాను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది. 




Updated Date - 2022-01-19T22:54:06+05:30 IST