యఽథేచ్ఛగా మట్టి తరలింపు

ABN , First Publish Date - 2020-09-26T07:06:10+05:30 IST

గ్రావెల్‌ పేరుతో జమ్మలమడుగు ప్రాంతంలో మట్టిని యథేచ్ఛగా ఇష్టానుసారంగా తరలించి కొందరు అక్రమార్జనకు పాల్పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

యఽథేచ్ఛగా మట్టి తరలింపు

 పట్టించుకోని అధికారులు ఫ ఆందోళనలో ప్రజలు


జమ్మలమడుగు రూరల్‌, సెప్టెంబరు 25: గ్రావెల్‌ పేరుతో జమ్మలమడుగు ప్రాంతంలో  మట్టిని యథేచ్ఛగా ఇష్టానుసారంగా తరలించి కొందరు అక్రమార్జనకు పాల్పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మండలంలోని గూడెం చెరువు, ఒంటిమిద్దె, గం డికోట రోడ్డులోని పలు ప్రాంతాల్లో గ్రావెల్‌ మట్టిని ఎక్స్‌కవేటర్ల ద్వారా రాత్రి, పగలు  జోరుగా తరలిస్తున్నారు.


పట్టణంలోని ప్రధాన రోడ్డు నుంచి ముద్దనూరు రోడ్డువైపు  మట్టిని  ట్రాక్టర్లు, టిప్పర్లు వేగంగా  తరలిస్తుండడం వలన పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోజుకు 300 ట్రాక్టర్లు, టిప్పర్లలో మట్టి తరలింపు జరుగుతోందని తద్వారా గండికోట రోడ్డులోని ఇరువైపుల కొండమట్టిని తవ్వి ఖాళీ చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కాగా గూడెం చెరువు మట్టిని తరలిస్తున్నారని సమీప గ్రామాలకు చెందిన ప్రజలు సంబందిత అధికారులకు తెలియజేసినా ఎవరూ పట్టించుకోలేదని  ఆవే దన వ్యక్తం చేస్తున్నారు.


100కు డయల్‌ చేయడంతోపాటు ప్రభుత్వం ఇచ్చిన నంబర్లకు అన్నింటికి సమస్య తెలియజేసినా దిక్కులేదన్నారు. జమ్మలమడుగు పట్టణంలో ట్రాఫిక్‌ లో విధులు నిర్వహించే పోలీసులు సైతం చేసేదిలేక వదిలేసినట్లు తెలుస్తోంది. కొం డమట్టిని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు తరలిస్తున్నట్లు పెద్దఎత్తున విమర్శ లున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు, మైనింగ్‌ శాఖాధికారులు తగు చర్యలు తీసు కుని గ్రావెల్‌ మట్టి తరలింపును అడ్డుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 


మట్టి తరలింపునకు ఎలాంటి అనుమతుల్లేవు

కాగా అక్రమంగా గ్రావెల్‌ మట్టి తరలింపు విషయంపై జమ్మలమడుగు తహసీల్దారు మధుసూదన్‌రెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా గ్రావెల్‌ మట్టిని తరలిస్తున్న వారికి ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. తమ సిబ్బందిని పంపించి తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 

Updated Date - 2020-09-26T07:06:10+05:30 IST