రాజంపేట గాయకులతో...

ABN , First Publish Date - 2020-09-26T07:03:28+05:30 IST

ప్రముఖ నేపఽథ్య గాయకుడు, గానగంధర్వుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి రాజంపేట కళాకారులతో ప్రత్యేక అనుబంధం ఉంది. నెల్లూరుకు జిల్లాకు చెందిన బాలు నెల్లూరు, గూడూరు ప్రాంతాల్లో 1981, 1982 సంవత్సరాల్లో అనేక పాటకచేరీలు, పాటల పోటీలు నిర్వహించారు.

రాజంపేట గాయకులతో...

        ప్రముఖ నేపఽథ్య గాయకుడు, గానగంధర్వుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి రాజంపేట కళాకారులతో ప్రత్యేక అనుబంధం ఉంది. నెల్లూరుకు జిల్లాకు చెందిన బాలు నెల్లూరు, గూడూరు ప్రాంతాల్లో 1981, 1982 సంవత్సరాల్లో అనేక పాటకచేరీలు, పాటల పోటీలు నిర్వహించారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో రాజంపేటకు చెందిన పలువురు పాల్గొనేవారు. 


ఇక్కడి కళాంజలి సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు, సీనియర్‌ పాత్రికేయుడు ఎస్‌.కళాంజలి(అప్పారావు) పాడిన పాటలను మెచ్చి బాలు సత్కరించారు. ఆనాటి మధుర స్మృతులను కళాంజలి ఆంధ్రజ్యోతితో నెమరు వేసుకున్నారు. బాలు మరణం తమకు తీరని లోటని వ్యక్తిగతంగా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

                                                                    - రాజంపేట

Updated Date - 2020-09-26T07:03:28+05:30 IST