Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 8 2021 @ 17:13PM

సైనిక హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో 13 మంది మృతి

చెన్నై: తమిళనాడు కూనూరు సమీపంలో సైనిక హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో 13 మంది కన్నుమూశారు. హెలికాఫ్టర్‌లో మొత్తం 14 మంది ప్రయాణిస్తుండగా 13 మంది చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. మృతుల్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ సతీమణి మధులిక ఉన్నారు. మరోవైపు ప్రమాదంలో గాయపడిన బిపిన్ రావత్‌ను ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలుండటంతో డీఎన్‌ఏ టెస్టులు చేస్తున్నారు. 
సూలూరు నుంచి వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ కాలేజీకి వెళ్తుండగా మధ్యాహ్నం 12:20 నిమిషాలకు ఈ హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు భారత వాయు సేన (ఐఏఎఫ్) దర్యాప్తునకు ఆదేశించింది. 

Advertisement
Advertisement