Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 8 2021 @ 18:12PM

బిపిన్ రావత్ కన్నుమూశారు: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటన

న్యూఢిల్లీ: తమిళనాడు సైనిక హెలికాఫ్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ కన్నుమూశారని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది. ఘటనలో రావత్‌తో పాటు ఆయన భార్య సహా 13 మంది చనిపోయారంటూ ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. 
మరోవైపు హెలికాఫ్టర్ ప్రమాదంపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమౌతోంది. న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ఈ కీలక సమావేశం జరుగుతోంది. హెలికాఫ్టర్ ప్రమాదం విషయం తెలియగానే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బిపిన్ రావత్ నివాసానికి వెళ్లారు. సైనిక ఉన్నతాధికారులు కూడా రావత్ నివాసానికి చేరుకున్నారు. ప్రమాదంపై ఆర్మీ చీఫ్ నరవణే ఇప్పటికే రాజ్‌నాథ్‌కు వివరించారు. 


సూలూరు నుంచి వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ కాలేజీకి వెళ్తుండగా మధ్యాహ్నం 12:20 నిమిషాలకు ఈ హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు భారత వాయు సేన (ఐఏఎఫ్) దర్యాప్తునకు ఆదేశించింది. 

Advertisement
Advertisement