వేదన వేళ వేడుకలా

ABN , First Publish Date - 2020-08-14T10:52:29+05:30 IST

‘కరోనా కారణంగా ఈ ఏడాది నా జన్మదిన వేడుకల పేరిట ఆడంబరాలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేయం

వేదన వేళ వేడుకలా

విజయవాడ, ఆంధ్రజ్యోతి : ‘కరోనా కారణంగా ఈ ఏడాది నా జన్మదిన వేడుకల పేరిట ఆడంబరాలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేయండి.’ అంటూ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. మంత్రి ఆలోచన ఆదర్శనీయంగానే ఉన్నా.. ఆయన అనుచరులు మాత్రం మంత్రి మెప్పు పొందేందుకు గతంలో ఎన్నడూ చేయని రీతిలో హడావిడి చేస్తున్నారు.


ఓవైపు కరోనాతో ప్రజలు బెంబేలెత్తుతుంటే మంత్రి అనుచరులు మాత్రం అట్టహాసంగా కటౌట్లు.. బ్యానర్లు.. హోర్డింగ్‌లతో నగరాన్ని మోత మోగిస్తున్నారు. లక్షలాది రూపాయలు వీటిపై ఖర్చుచేసే బదులు పేదలకు, కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి సాయం చేస్తే బాగుండేదని మంత్రి సన్నిహితులే అంటున్నారు. 


అందరూ దందారాయుళ్లే..

మంత్రి పేరుతో నగరంలో వెలిసిన హోర్డింగుల్లో అధికశాతం ఆయన పేరుతో దందాలు చేసేవారే ఉన్నారని సొంత పార్టీవారే చెబుతున్నారు. నకిలీ శానిటైజర్లు తయారు చేసి ప్రజల జేబులు గుల్ల చేసిన ఓ వ్యక్తి నగరంలో మంత్రి పేరుతో భారీ హోర్డింగ్‌ పెట్టారు. అలాగే, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో బెడ్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్న మరో వ్యక్తి మంత్రి పేరుతో భారీ బ్యానర్లను ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2020-08-14T10:52:29+05:30 IST