ఘనంగా గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-11-27T06:16:33+05:30 IST

గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో నాతయ్యపాలెంలో నిర్వహిస్తున్న గౌరీ పరమేశ్వర మహోత్సవాలలో బాగంగా శుక్రవారం నిర్వహించిన సారె ఊరేగింపు భక్తులను ఎంతో ఆకట్టుకుంది.

ఘనంగా గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు
నాతయ్యపాలెంలో గౌరీ పరమేశ్వరుల సారె ఊరేగింపు నిర్వహిస్తున్న భక్తులు

అక్కిరెడ్డిపాలెం, నవంబరు 26:  గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో నాతయ్యపాలెంలో నిర్వహిస్తున్న గౌరీ పరమేశ్వర మహోత్సవాలలో బాగంగా శుక్రవారం నిర్వహించిన సారె ఊరేగింపు భక్తులను ఎంతో ఆకట్టుకుంది.  విభిన్న రకాల స్వీట్లు, పండ్లు, పుష్పాలను మహిళలు పళ్లెంలలో అమర్చి అక్కిరెడ్డిపాలెం హైస్కూల్‌ మైదానం నుంచి ఊరేగింపు ప్రారంబించారు. మేళతాలాలతో  ఈ సారె ఊరేగింపుు అక్కిరెడ్డిపాలెం, నాతయ్యపాలెం పురవీధులలో కొనసాగింది. అనంతరం గౌరీపరమేశ్వరులకు సారె సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Updated Date - 2021-11-27T06:16:33+05:30 IST