Abn logo
Oct 15 2020 @ 19:36PM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి శుభాకాంక్షలు తెలిపిన సెలబ్రిటీలు

Kaakateeya

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 11వ వార్షికోత్సవం సందర్భంగా సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు. 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 11వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 11 సంవత్సరాలుగా నిత్యం కొత్త కొత్త వార్తలతో.. సమాజాన్ని పురోగమింపజేయడానికి ప్రయత్నిస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి నా అభినందనలు' అన్నారు ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. 11వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఆంధ్రజ్యోతికి ఆల్‌ ద బెస్ట్ అని చెప్పారు ప్రముఖ నటుడు, మా మాజీ ప్రెసిడెంట్‌ శివాజీరాజా. 11 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు అన్నారు సంగీత దర్శకుడు కోటి. 


11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆంధ్రజ్యోతికి శుభాకాంక్షలు.. కీప్‌ రాకింగ్‌ అన్నారు అనూప్‌ రూబెన్స్‌. ఇలాంటి వసంతాలు 100 జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలుపుతూ.. శుభాకాంక్షలు తెలిపారు హీరోయిన్‌ అక్ష. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి 11 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అన్నారు హీరోయిన్‌ అదితిరావు హైదరి.

ఇవి కూడా చదవండిImage Caption

దమ్మున్న ఛానెల్.. పదకొండేళ్ల ప్రస్థానంఎన్నెన్నో మైలురాళ్లను అధిగమించిన ఏబీఎన్

11 వసంతాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగు పెడుతున్న ఏబీఎన్‌ ఛానెల్‌కు హ్యాపీ బర్త్‌డే.. ఇలాంటి బర్త్‌డేలు మరెన్నో జరుపుకోవాలి. ఇంకా ఎన్నో చీకట్లో ఉన్న సత్యాలను వెలుగులోకి తెస్తూ.. ఆపదలో ఉన్న పేదవాడిని వెలుగులోకి తెస్తూ.. ఎన్నో మంచి మంచి న్యూస్‌లు ఈ ప్రజానీకానికి అందించే మహత్తర ఏబీఎన్‌గా ఓ వెలుగు వెలగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.. ఆల్‌ ద బెస్ట్ ఏబీఎన్‌.. అని అన్నారు నటుడు, రాజకీయ నాయకులు బాబు మోహన్‌. 11 వసంతాలు పూర్తి చేసుకున్న ఏబీఎన్‌కు శుభాకాంక్షలు. మరింత పట్టుదలతో, దిగ్విజయంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.. అన్నారు రచయిత భువనచంద్ర.

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి 11 సంవత్సరాలు విజయవంతంగా ప్రజల పక్షాన, ప్రజల గొంతుకై.. సమాజాన్ని మేల్కొలిపే విషయంలో కావచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయంలో కావచ్చు. అనేక అంశాల పట్ల కావచ్చు.. సమాజంలోని ఓ మానవీయ కోణంలో కావచ్చు.. ప్రతి అంశాన్ని స్పృశిస్తూ.. అద్బుతంగా ఛానెల్‌కు ఉండాల్సిన నిబద్ధతను, నియమాలను పాటిస్తూ.. విజయవంతంగా ముందుకు సాగుతూ.. 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి సిబ్బంది అందరికీ, ముఖ్యంగా సృష్టికర్త రాధాకృష్ణగారికి ప్రత్యేకమైన శుభాభినందనలు, శుభాకాంక్షలు అని తెలిపారు ప్రముఖ దర్శకుడు ఎన్‌. శంకర్‌.

ఇంకా బాలీవుడ్‌ నటులు సురేష్‌ ఒబెరాయ్‌, అభిమన్యు సింగ్‌, ఆశిష్‌ విద్యార్థి.. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి.. హీరోలు సుమంత్‌, రాజ్‌ తరుణ్‌, సునీల్.. హీరోయిన్స్‌ ప్రణీత, శ్రద్దాదాస్‌, హెబా పటేల్‌, పాయల్‌ ఘోష్‌, సింగర్‌ స్మిత, శ్రియారెడ్డి, అదిరే అభి, గడ్డం నవీన్ వంటి ప్రముఖులందరూ ఏబీఎన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. 





Advertisement
Advertisement