వివాహమైతే... అంతా ముగిసిపోయినట్లు కాదు: కిరణ్‌ డెంబ్లా

ABN , First Publish Date - 2021-02-11T21:55:02+05:30 IST

వివాహం కాగానే తమ జీవితంలో ఫిట్‌నెస్‌ పరంగా సాధించాల్సింది ఏమీ లేదని చాలామంది మహిళలు భావిస్తుంటారు. కానీ

వివాహమైతే... అంతా ముగిసిపోయినట్లు కాదు: కిరణ్‌ డెంబ్లా

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 10, ఆంధ్రజ్యోతి: వివాహం కాగానే తమ జీవితంలో ఫిట్‌నెస్‌ పరంగా సాధించాల్సింది ఏమీ లేదని చాలామంది మహిళలు భావిస్తుంటారు. కానీ వివాహం తరువాత కూడా మన శరీరాన్ని సరిగా నిర్వహించవచ్చు. వ్యకిగత జీవితంతో పాటుగా బాహ్యజీవితంలో కూడా సమతుల్యత పాటించాల్సిన అవసరం నేటి మహిళలకు ఉంది అని అన్నారు సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ కిరణ్‌ డెంబ్లా. ఓ మహిళకు 30 సంవత్సరాలు దాటిన తరువాత కుటుంబాన్ని చూసుకోవడం ఎంత అవసరమో తమ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా అంతే అవసరమని ఆమె అన్నారు.  ఆల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా బుధవారం వర్ట్యువల్‌గా  ‘మహమ్మారి వేళ పౌష్టికాహారం -కుటుంబ ఆరోగ్యానికి భరోసా కల్పించాల్సిన ఆవశ్యకత’ అనే అంశంపై ఓ సదస్సును నిర్వహించింది. ఈ చర్చా కార్యక్రమంలో  దేశంలో ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతలపై చర్చించడంతో పాటుగా తమ రోజువారీ ఆహారం, జీవనశైలిలో  కుటుంబాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి సైతం చర్చించారు. ఈ సదస్సుకు నటి, వ్యాఖ్యాత షర్మిల కాసాల మోడరేట్‌ చేయగా, సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ నిపుణురాలు , శిక్షకురాలు కిరణ్‌ డెంబ్లాతో పాటుగా న్యూట్రిషన్‌ -వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా కిరణ్‌ డెంబ్లా మాట్లాడుతూ.. సమతుల్యమైన ఆహారం, తగినంతగా తినడం అనేవి చాలా కీలకం అన్నారు. గత సంవత్సరం వినూత్నమైనదంటూ మనలో చాలామందికి జీవితపు విలువను తెలియజేసింది. ఓ తల్లిగా, భార్యగా తమ కుటుంబ ఆరోగ్యం, భద్రతను నిర్వహించడం తగిన నివారణ చర్యలను తీసుకోవడం తన బాధ్యత అని తాను భావిస్తుంటానన్నారు. బాదములలో రోగ నిరోధకశక్తికి మద్దతునందించే పోషకాలు అధికంగా ఉన్నాయంటూ  భోజనాల నడుమ స్నాక్‌గా బాదమలను తీసుకుంటే మంచిదన్నారు. సినీ నటి తమన్నా తన అభిమాన విద్యార్థి అయినప్పటికీ తన స్టూడెంట్స్‌ అందరూ తనకు అతి ముఖ్యమేనన్నారు. ఈ సదస్సు ద్వారా ఆరోగ్యానికి సంబంధించి మూడు ముఖ్యాంశాలైన పౌష్టికాహారం, ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాల్సిన ఆవశ్యకతపై షీలా, కిరణ్‌ దృష్టి వెల్లడించారు. బుద్ధిపూర్వకంగా చిరుతిళ్లను తీసుకోవాల్సిన ఆవశ్యకతను గురించి వీరు వెల్లడించడంతో పాటుగా నగరంలోని కుటుంబాలన్నీ కూడా తమ ఆహారంలో ఆరోగ్యవంతమైన స్నాకింగ్‌ను భాగం చేసుకోవాల్సిందిగా సూచించారు. 

Updated Date - 2021-02-11T21:55:02+05:30 IST