Cellphone టవర్‌ ఏర్పాటుపై గ్రామస్తుల ఆందోళన

ABN , First Publish Date - 2021-10-27T12:30:11+05:30 IST

తమ గ్రామంలో సెల్‌ఫోన్‌ టవర్‌ ఏర్పాటు చేయరాదని డిమాండు చేస్తూ మంగళ వారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తిరువళ్లూర్‌ జిల్లా గుమ్మిడిపూండి యూనియన్‌ సమీపం అత్తూపాక్కం గ్రామంలో ఓ ప్రైవేటు సంస్థ సె

Cellphone టవర్‌ ఏర్పాటుపై గ్రామస్తుల ఆందోళన

గుమ్మిడిపూండి(Chennai): తమ గ్రామంలో సెల్‌ఫోన్‌ టవర్‌ ఏర్పాటు చేయరాదని డిమాండు చేస్తూ మంగళ వారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తిరువళ్లూర్‌ జిల్లా గుమ్మిడిపూండి యూనియన్‌ సమీపం అత్తూపాక్కం గ్రామంలో ఓ ప్రైవేటు సంస్థ సెల్‌ఫోన్‌ టవర్‌ ఏర్పాటుకు గతవారం గ్రామ సభ ఏర్పాటుచేసి ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఆ సభలో సెల్‌ఫోన్‌ టవర్‌ ఏర్పాటును గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రైవేటు సంస్థ నిర్వాహకులు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మంగళవారం సదరు సంస్థ నిర్వాహకులు టవర్‌ నిర్మాణం చేపట్టడాన్ని గమనించిన గ్రామస్తులు, పనులను అడ్డుకొని సమీపంలోని జాతీయ రహదారిపై భైఠాయించి ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న గుమ్మిడిపూండి పోలీసులు అక్కడకు చేరుకొని వారికి సర్దిచెప్పి పంపించారు.

Updated Date - 2021-10-27T12:30:11+05:30 IST