జనావాసాల మధ్య సెల్‌టవర్లు

ABN , First Publish Date - 2020-08-14T10:52:52+05:30 IST

పరిగి పట్టణ, గ్రామీణప్రాంతాల్లోని జనావా సాల మధ్యనే సెల్‌టవర్లు ఏర్పాటు చేస్తున్నారు.

జనావాసాల మధ్య సెల్‌టవర్లు

ఆపై పన్నుల ఎగవేత పట్టించుకోని అధికారులు


పరిగి: పరిగి పట్టణ, గ్రామీణప్రాంతాల్లోని జనావా సాల మధ్యనే సెల్‌టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. సెల్‌ టవర్ల ద్వారా వచ్చే రేడియేషన్ల ద్వారా జనం ఇబ్బం దులు పడుతున్నారు. ఆపై సెల్‌టవర్ల యాజమాన్యాలు పురపాలక సంఘం, పంచాయతీలకు పన్నులు కట్ట కున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పరిగి పట్టణంలో పదిచోట్ల టవర్లు ఉన్నాయి. అలాగే మండలపరిధిలోని సయ్యద్‌పల్లి, రాపోల్‌, మాదా రం, నస్కల్‌, గడిసింగాపూర్‌ తదితర గ్రామాల్లో వివిధ కంపెనీలకు చెందిన 30కిపైగా సెల్‌టవర్లు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు. ఏగ్రామంలో సెల్‌టవర్‌ నిర్మించా లన్నా గ్రామపంచాయతీకి రూ.10 వేలు అనుమతి ఫీజు కట్టాల్సి ఉంటుంది.


కానీ ఏర్పాటు సమయంలో సెల్‌ టవర్‌ యజమానులు పన్నులు చెల్లించిన దాఖలా ఒక్కటీ లేదు. అలాగే ప్రతిఏటా  గ్రామపంచాయతీలకు సెల్‌టవర్‌ నిర్వాహకులు టవర్‌ నిర్మాణాన్ని బట్టి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ చాలా గ్రామాల్లో సర్పంచ్‌లకు, కార్యదర్శులకు అవగాహన లేక పన్నులు వసూలు చేయడం లేదు. ప్రజల నుంచి వసూలు చేస్తున్న ఇంటి పన్నులతో పాటు అధికారులు సెల్‌ టవర్‌ నిర్వాహకుల నుంచి పన్నులు వసూలు చేస్తే గ్రామపంచాయతీలకు మరింత ఆదాయం సమకూరుతుంది. పన్నుల సంగతి అలాఉంచితే ఇళ్లపై ఇష్టారాజ్యంగా టవర్ల నిర్మాణాలు చేపడుతుండటంతో గాలివానలకు ఎక్కడ కూలి ప్రమాదాలు జరుగుతాయోనని ప్రజలు భయపడుతున్నారు. టవర్ల ఏర్పాటులో కూడా నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


ఇళ్ల మధ్య నుంచి తొలగించాలి..చిన్నయ్య, రిటైర్డ్‌ తహసీల్దార్‌, పరిగి

ఇళ్ల మధ్య నుంచి సెల్‌టవర్లను తొలగించాలి. టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ల ద్వారా ప్రజలు రోగాలబారిన పడే అవకాశం ఉంది. ఆపై పన్నులను కూడా ఎగ్గొడుతున్నారు. సెల్‌టవర్లను ఇళ్ల మధ్యన కాకుండా ఊరిబయట ఏర్పాటు చేసుకోవాలి. 

Updated Date - 2020-08-14T10:52:52+05:30 IST