Abn logo
Sep 23 2021 @ 00:29AM

సెల్‌ఫోన్ల దొంగ అరెస్ట్‌: కారు స్వాధీనం

పెనుకొండ, సెప్టెంబరు 22: ఇటీవల పెనుకొండ తదితర ప్రాంతాల్లో మొబైల్‌ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగ ల్లో ఒకరిని అరె్‌స్టచేసి ఓ కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ ర మేష్‌బాబు తెలిపారు. పట్టుబడిన వ్యక్తి కర్నూలుజిల్లా డోనకు చెందిన వ్యక్తి అని వెంకటేశులు, హరి అనే వ్యక్తితోకలిసి వీరు మొబైల్‌లు దొంగలించేవారన్నారు. వెంకటేశులు పట్టుబడగా హరి పరారయ్యాడన్నారు. అతడి కోసం గాలిస్తున్నారన్నారు. వెంకటేశులును అరె్‌స్టచేసి దొంగతనాలకు ఉపయోగిస్తున్న కారుతోపాటు మూడు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.