సినిమా హాళ్లు తెరుచుకునేందుకు బెంగాల్ ఓకే

ABN , First Publish Date - 2021-07-30T05:20:11+05:30 IST

సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓకే చెప్పింది. 50 శాతం ఆక్యుపెన్సీతో..

సినిమా హాళ్లు తెరుచుకునేందుకు బెంగాల్ ఓకే

కోల్‌కతా: సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓకే చెప్పింది. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతులిస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. జూలై 31 నుంచి ఇది అమలులోకి వస్తుందని, ఆ రోజు నుంచి థియేటర్లు తెరుచుకోవచ్చని తెలిపింది. అయితే థియేటర్లు తెరిచినప్పటికీ.. కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.


ఇదిలా ఉంటే కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని వెల్లడించింది. అలాగే లోకల్ రైళ్లు కూడా పనిచేయవని తెలిపింది. కాగా.. బెంగాల్‌లో ప్రస్తుతం ప్రతి రోజూ వెయ్యిలోపు కేసులు నమోదవుతున్నాయి. 10వేల వరకు యాక్టివ్ కేసులున్నాయి.

Updated Date - 2021-07-30T05:20:11+05:30 IST