Abn logo
Oct 23 2021 @ 02:45AM

విద్యుత్తుపై కేంద్రం నిర్ణయాలు

  • భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు: జగదీశ్‌రెడ్డి


పాలమూరు, అక్టోబరు 22: విద్యుత్తు చట్టాల పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా మారాయని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌(1104) యూనియన్‌ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర 4వ జనరల్‌ కౌన్సిల్‌కు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. విద్యుత్తు కార్మికులు, ఉద్యోగులు, రైతులను రాష్ట్ర ప్రభుత్వం సమాన దృష్టితో చూస్తోందన్నారు. విద్యుత్తు సంస్థలను, కార్మికులను కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌, టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి ప్రసంగించారు.

తెలంగాణ మరిన్ని...