కరోనా నియంత్రణలో కేంద్రం విఫలం : సీపీఐ

ABN , First Publish Date - 2021-05-11T05:51:18+05:30 IST

కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం పూ ర్తిగా విఫలమైందని సీపీఐ నాయకులు ఆరోపించారు. ఇందుకు నిరస నగా సోమవారం స్థానిక పార్టీ కార్యాలయం వద్ద ప్రధానమంత్రి న రేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

కరోనా నియంత్రణలో కేంద్రం విఫలం : సీపీఐ
గుంతకల్లులో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సీపీఐ నాయకులు

గుంతకల్లు టౌన, మే 10: కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం పూ ర్తిగా విఫలమైందని సీపీఐ నాయకులు ఆరోపించారు. ఇందుకు నిరస నగా సోమవారం స్థానిక పార్టీ కార్యాలయం వద్ద ప్రధానమంత్రి న రేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా పట్టణ కార్యదర్శి వీరభద్రస్వామి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర ్లక్ష్యం వల్ల కరోనా సెకెండ్‌వేవ్‌ ఉగ్రరూపం దాల్చిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కరోనా కట్టడికి చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. నిరసనలో నాయకులు మక్బుల్‌ బాషా, ఈశ్వరయ్య, కుళ్లాయప్ప, దేవేంద్ర, బాబా, చిరంజీవి, గోపి పాల్గొన్నారు.


తాడిపత్రి : కరోనా నియంత్రణలో కేంద్రప్రభుత్వ వైఫల్యాన్ని నిరసి స్తూ సోమవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ సర్కిల్‌లో సీపీఐ నాయకు లు నిరసన చేపట్టారు. నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య మాట్లాడు తూ దేశంలో కరోనా పెరగడానికి పరోక్షంగా ప్రధాని మోదీనే కారణమన్నారు. దేశ ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. నిరసనలో నాయకులు రామాంజి, జయరాములు, అబ్రహం, సాధిక్‌వ లి, బాబావలి పాల్గొన్నారు.

రాయదుర్గం రూరల్‌ : కరోనా బాధితులు రోజురోజుకు పిట్టల్లా రాలిపోతున్నా కేంద్రం చికిత్స అందించడంలో పూర్తిగా విఫలమైందని సీపీఐ తాలుకా కార్యదర్శి నాగార్జున మండిపడ్డారు. సోమవారం పట్టణంలోని వినాయక సర్కిల్‌ వద్ద నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు లక్షల్లో పెరుగుతున్నా, తగిన వైద్యు సదుపాయాలు అందించడంలో కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. నిరసనలో నాయకులు న రసింహులు, నాగేశ్వరరావు, తిప్పేస్వామి, లోకన్న, దుర్గన్నపాల్గొన్నారు. 


కూడేరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణలో విఫలమయ్యాయని సీపీఐ మండల కారర్యదర్శి మల్లికార్జున విమర్శించారు. సోమవారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. రోగులకు ఆక్సిజన అందక పిట్టల్లా రాలిపోతున్నారన్నారు. సమావేశంలో నాయకులు శ్రీరాములు, రమణప్ప పాల్గొన్నారు. 


పుట్లూరు: కొవిడ్‌ వ్యాక్సిన సరఫరాలో కేంద్రప్రభుత్వం విఫలమైందని సీపీఐ నాయకులు ఆరోపించారు. సోమవారం మండలంలోని కందికాపుల గ్రామ సచివాలయం ఎదుట ప్రధాని మోదీ ముఖచిత్రం   ప్రతులను దహనం చేశారు. మండల కార్యదర్శి పెద్దయ్య మాట్లాడు తూ దేశంలో కొవిడ్‌ వ్యాక్సిన సరఫరా లేక లక్షలాదిమంది చనిపోతు న్నా మోదీ పట్టించుకున్న పాపానపోలేదన్నారు.


సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా

గుంతకల్లు టౌన: పట్టణంలో కరోనా నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద సోమవారం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టా రు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి బీ శ్రీనివాసులు మాట్లాడుతూ పట్టణంలో మెరుగైన పారిశుధ్య పనులు వెంటనే చేపట్టాలన్నారు.   ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను నియమించి, కరోనా బాధితులకు పౌష్టికాహారాన్ని అందజేయాలన్నారు. అనంతరం కమిషనర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. నిరసనలో నాయకులు దాసరి శ్రీనివాసులు, మారుతీ ప్రసాద్‌, సాకే నాగరాజు, తిమ్మప్ప, రామాంజినేయులు, రామూ నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T05:51:18+05:30 IST