అందరికీ వ్యాక్సిన సరఫరాలో కేంద్రం విఫలం

ABN , First Publish Date - 2021-05-11T06:00:02+05:30 IST

కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరికీ వ్యాక్సిన సరఫరా చేసి ప్రాణాలను కాపాడ డంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మావతి విమర్శించారు.

అందరికీ వ్యాక్సిన సరఫరాలో కేంద్రం విఫలం
ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సీపీఐ, మహిళా సమాఖ్య నాయకులు

సీపీఐ ఆధ్వర్యంరో ప్రధాని మోదీ దిష్టి బొమ్మ దహనం

అనంతపురం క్లాక్‌టవర్‌, మే 10 : కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరికీ వ్యాక్సిన సరఫరా చేసి ప్రాణాలను కాపాడ డంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మావతి విమర్శించారు. కొవిడ్‌ సరఫరాలో నిర్లక్ష్యానికి నిరసనగా సోమవారం స్థానిక మహిళా స మాఖ్య కార్యాలయంలో సీపీఐ, మహిళా సమాఖ్య నాయకులు ప్ర ధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ ప్రజలందరికీ కొవిడ్‌ వ్యాక్సిన సరఫరా చేయడంలో మోదీ విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి తగినంత వ్యాక్సిన సరఫరా చేసి, కొవిడ్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ నాయకులు రామాంజనేయులు, జయరాం, రామాంజి, వలీ, ఓలప్ప, మహిళా సమాఖ్య అలివేలమ్మ, కదిరమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-11T06:00:02+05:30 IST