Abn logo
Sep 22 2021 @ 00:41AM

కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం

పాదయాత్రను ప్రారంభిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబా

- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబా

కరీంనగర్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 21: కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సాయాబాబా అన్నారు. మంగళవారం కొత్తపల్లి మండలం బావుపేట గ్రామంలో కార్మిక గర్జన మహా పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో ప్రజలను ఇళ్లలో బందీలను చేసి, యాజమాన్యాలకు అనుకూలంగా కార్మిక చట్టాలను రూపొందించారన్నారు.  రాష్ట్రంలోని కాలం చెల్లిన పాత వేతన సవరణ జీవోలతో కార్మికులకు నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రజలు, కార్మికులను చైతన్య పరిచే దిశగా కార్మిక గర్జన పాదయాత్రను చేపట్టామన్నారు. కార్యక్రమంలో ఎడ్ల రమేష్‌, యు శ్రీనివాస్‌, బండారు శేఖర్‌, బి రాజేశం, సీహెచ్‌ భద్రయ్య, జిందం ప్రసాద్‌, గీట్ల ముకుందరెడ్డి, కొప్పుల శంకర్‌, కదిరి రమేష్‌, జనగాం రాజమల్లు, కవ్వంపల్లి అజయ్‌, శ్రీలత పాల్గొన్నారు.