Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వ ఆస్తులను కేంద్రం అమ్మేస్తోంది: రామకృష్ణ

విజయవాడ: ప్రభుత్వ ఆస్తులను కేంద్రం అమ్మేస్తోందని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తలు అంబానీ, అదానీలకు ప్రజల సొమ్మును దోచి పెడుతున్నారని దుయ్యబట్టారు. ఈ నెల 27న భారత్‌ బంద్‌కు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. వైసీపీ కూడా ఈ బంద్‌లో పాల్గొని చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే జగన్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని రామకృష్ణ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement