Abn logo
Oct 15 2021 @ 00:39AM

‘సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం తగదు’

సంస్థాన్‌ నారాయణపురం, అక్టోబరు 14: తెలుగు రాష్ట్రాల్లో సాగు నీటి ప్రాజె క్టులపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం తగదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి అయిలయ్య అన్నారు. సంస్థాన్‌ నారాయణపురంలో ఆయన విలేకరులతో గురు వారం మాట్లాడారు. రాష్ట్రాల మధ్య సాగునీటి ప్రాజెక్టుల వివాదం పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులను తన ఆధీనంలో తీసుకోవడం కోసం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఈ గెజిట్‌ నోటిఫికేషన్‌ టీడీపీ వ్యతి రేకిస్తుందన్నారు. సమావేశంలో కుక్కల నర్సింహ, ఏర్పుల సుదర్శన్‌ పాల్గొన్నారు.