రైతులను దగా చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2021-12-06T03:41:34+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను దగా చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు రామడుగు లక్ష్మణ్‌, సీపీఐ పట్టణ కార్యదర్శి ఖలీందర్‌ఆలీఖాన్‌లు పేర్కొన్నారు. ఆదివారం సీపీఐ కార్యాల యంలో వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయ కుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు.

రైతులను దగా చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
మాట్లాడుతున్న సీపీఐ నాయకులు

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 5: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను దగా చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు రామడుగు లక్ష్మణ్‌, సీపీఐ పట్టణ కార్యదర్శి ఖలీందర్‌ఆలీఖాన్‌లు పేర్కొన్నారు. ఆదివారం సీపీఐ కార్యాల యంలో వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయ కుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. ప్రభు త్వాల వైఖరికి నిరసనగా ఈనెల 7న కొనుగోలు కేంద్రాల వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సవర ణలు చేస్తూ పౌరుల ప్రాథమిక హక్కులు లేకుండా చేస్తోందని విమర్శించారు. ఈ నెల 26న పార్టీ 97వ ఆవిర్భావ వేడుకలను జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో విజయవంతం చేయాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలకు చెం దిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు రాజకీయ తరగతులను ఈనెల 21, 22 తేదీల్లో పెద్దపల్లిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాయకులు మల్లయ్య,  పౌల్‌, కిషన్‌రావు, రవి, శ్రీనివాస్‌, రాజేశం, శంకరయ్యలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-06T03:41:34+05:30 IST