రైతులను ముంచుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు: జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-12-02T01:32:42+05:30 IST

కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు తోడుదొంగల్లా రైతులను ముంచుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు.

రైతులను ముంచుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు: జీవన్‌రెడ్డి

కరీంనగర్‌: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు తోడుదొంగల్లా రైతులను ముంచుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి అప్పు చేసి పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలకు తెచ్చి 20 రోజులు గడుస్తున్నా కొనగోళ్లు చేపట్టడం లేదని తప్పుబట్టారు. 30 శాతం పంట మాత్రమే కొనుగోలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం సిగ్గుచేటన్నారు. ఒకవైపు రైతులు ఇక్కట్లు పడుతుంటే మంత్రి ఎమ్మెల్సీ క్యాంపు రాజకీయాల్లో మునిగి తేలుతున్నారని మండిపడ్డారు. మిల్లర్లు, ప్రభుత్వ పెద్దలు, అధికారులు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అవసరం లేదని, 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ సరిపోతుందని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-02T01:32:42+05:30 IST