కోవిడ్‌పరీక్షలను మరింత ఎక్కువ చేశాం- సీఎస్‌

ABN , First Publish Date - 2020-07-05T00:56:52+05:30 IST

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కోవిడ్‌ పరీక్షలను కూడా పెద్దయెత్తున నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు.

కోవిడ్‌పరీక్షలను మరింత ఎక్కువ చేశాం- సీఎస్‌

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కోవిడ్‌ పరీక్షలను కూడా పెద్దయెత్తున నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. నగరానికి కేంద్ర బృందం పర్యటనలో సూచించిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నామని అన్నారు. కేవలం కరోనా పరీక్షలనే కాకుండా కంటైన్‌మెంట్‌ జోన్లలో కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. శనివారం కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబ అన్నిరాష్ర్టాల చీఫ్‌ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్‌నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తోనూ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణలో కోవిడ్‌ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్నచర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ కంటైన్‌మెంట్‌జోన్లలో కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.


టెక్నాలజీని ఉపయోగించుకుని ఎక్కువ టెస్ట్‌లను చేయడమే కాకుండా ఇతర చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కరోనా మృతుల సంఖ్యను తగ్గించే విషయంపై ఎక్కువ దృష్టిపెట్టాలని ఈసందర్భంగా కేబినెట్‌ సెక్రటరీ సూచించారు. ఈసందర్భంగా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ రాష్ట్రంలో పీపీఈలు, ఎన్‌-95 మాస్క్‌లు, క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌, ఇతర మౌలికల వసతులపై కూడా కేబినెట్‌ సెక్రటరీతో చర్చించారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ శాంతకుమారి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ వికాస్‌రాజ్‌, రవి గుప్తా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-05T00:56:52+05:30 IST