Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫ్యూయల్ ఫ్లెక్స్ ఇంజన్‌... త్వరలో కేంద్రం కొత్త నిర్ణయం...

న్యూఢిల్లీ : చమెురు ధరలు ఇష్టారాజ్యంగా పెరిగిపోతోన్న నేపధ్యంలో... వాహనదారులు ఇప్పుడు విద్యుత్తు వాహనాల వైపు మొగ్గుచూపుతున్న విషయం తెలిసిందే. ఇక... ఈ క్రమంలోనే...  ఫ్లెక్సిబుల్ ఇంజన్‌ కారు చర్చ కూడా జోరందుకుంది. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ వర్గాల మేరకు... ఫ్లెక్స్ ఇంధన ఇంజిన్‌పై ప్రభుత్వం రాబోయే కొద్ది రోజుల్లో పెద్ద నిర్ణయం తీసుకోబోతోంది. రోజురోజుకూ పెరిగిపోతోన్నన్న పెట్రోల్-డీజిల్ ధరలతో ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో... ప్రత్యామ్నాయాల దిశగా అందరి ద‌ృష్టీ కేంద్రీకృతమై ఉంది.


ఈ క్రమంలోనే... విద్యుత్తు ఇంజిన్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక... తాజాగా ఫ్లెక్స్ ఇంజన్ అంటే ఫ్లెక్సిబుల్ ఇంజన్‌ వాహనం విషయమై కూడా చర్చ  జోరందుకుంది. రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం... ఫ్లెక్స్ ఇంధన ఇంజిన్‌పై ప్రభుత్వం రాబోయే కొద్ది రోజుల్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతోంది. ఆటోమొబైల్ పరిశ్రమ సైతం ఈ ఇంజన్ ను తప్పనిసరి చేసే దిశగా యోచిస్తున్నట్లు వినవస్తోంది. ఇథనాల్ ధర లీటరుకు రూ. 60-62. దీంతోనే... ఫ్లెక్స్ ఇంజిన్ వాహనాలు నడుస్తాయి. అంటే... డీజిల్‌తో పోలిస్తే లీటరుకు రూ. 30-రూ. 40 ఆదా అవుతుంది. వచ్చే రెండేళ్లలో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. తద్వారా భారత్ తక్కువ చమురును మాత్రమే దిగుమతి చేసునే వెసులుబాటు ఉంటుంది. 


Advertisement
Advertisement