Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోలవరం ప్రాజెక్ట్‌పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని పార్లమెంటు సాక్షిగా సోమవారం కేంద్రం తేల్చిచెప్పింది. సోమవారం రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం గురించి ప్రశ్నించారు. కనకమేడల ప్రశ్నకు కేంద్ర జలశక్తివనరుల సహాయమంత్రి బిశ్వేశ్వర తుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. బాధితులకు పునరావాసం, పరిహారంలో జాప్యంతో పాటు కరోనా కారణంగా పోలవరం నిర్మాణ పనుల్లోనూ జాప్యం జరిగిందని వెల్లడించారు. స్పిల్ వే చానల్ పనులు 88 శాతం పూర్తవగా, ఎప్రోచ్ చానల్ ఎర్త్ వర్క్ పనలు 73 శాతం, పైలెట్ చానల్ పనులు 34 శాతం మాత్రమే పూర్తయ్యాయని కేంద్ర జలశక్తివనరుల సహాయమంత్రి తెలిపారు. పోలవరం సవరించిన అంచనాలు రూ.55,548.87కోట్లకు టీఏసీ ఆమోదించిన మాట వాస్తవమేనని, అయితే 2020 మార్చిలో సవరించిన అంచనాలపై ఆర్‌సీసీ నివేదిక ఇచ్చిందని, దాని ప్రకారం రూ.35,950.16 కోట్లకు మాత్రమే కేంద్రం అంగీకారం తెలిపిందని బిశ్వేశ్వర తుడు తన లిఖితపూర్వక సమాధానలో పేర్కొన్నారు.


Advertisement
Advertisement