యూపీలో 210 కిలోమీటర్ల ‘రామ్ వన్ గమన్ మార్గ్’కు ఏర్పాట్లు!

ABN , First Publish Date - 2021-04-05T13:57:52+05:30 IST

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ...

యూపీలో 210 కిలోమీటర్ల ‘రామ్ వన్ గమన్ మార్గ్’కు ఏర్పాట్లు!

లక్నో: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ ఉత్తరప్రదేశ్‌లో 210 కిలోమీటర్ల ‘రామ్ వన్ గమన్ మార్గ్’ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. రామాయణంలో పేర్కొన్న వివరాల ప్రకారం శ్రీరాముడు సీతామాతా లక్ష్మణ సమేతుడై వచ్చాడని భావిస్తున్న ఈ మార్గాన్ని ‘రామ్ వన్ గమన్ మార్గ్‘గా తీర్చిదిద్దనున్నారు. 


కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ 210 కిలోమీటర్ల రామ్ వన్ గమన్ మార్గ్ అయోధ్యలోని ఫైజాబాద్, చిత్రకూట్, సుల్తాన్‌పూర్, ప్రతాప్‌గఢ్, జెఠ్వారా, శృంగవేర్పూర్, మంఝన్‌పూర్, రాజాపూర్‌లను అనుసంధానించనుంది. ఈ రహదారి జాతీయ రహదారి-28, జాతీయ రహదారి-96, జాతీయ రహదారి-713లను కలపనుంది. ఈ రహదారి కారణంగా శృంగవేశ్వర్‌పూర్‌లో గంగా నదిపై వంతెన ఏర్పాటుతో నూతన మార్గం ఏర్పడనుంది. 


Updated Date - 2021-04-05T13:57:52+05:30 IST