Zydus Cadila క్లినికల్ ట్రయల్స్ పూర్తి... త్వరలో 12 ఏళ్లు దాటినవారికి టీకా!

ABN , First Publish Date - 2021-07-17T11:51:59+05:30 IST

Zydus Cadila సంస్థ రూపొందించిన...

Zydus Cadila క్లినికల్ ట్రయల్స్ పూర్తి... త్వరలో 12 ఏళ్లు దాటినవారికి టీకా!

న్యూఢిల్లీ: Zydus Cadila సంస్థ రూపొందించిన డీఎన్ఏ ఆధారిత ZyCoV-D కరోనా వ్యాక్సిన్‌ 12 నుంచి 18 ఏళ్ల వయసువారికి ఉపయోగించేందుకు క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసిందని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు దిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలియజేసింది. త్వరలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నదని పేర్కొంది. 


కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సెక్రటరీ సత్యేంద్ర సింగ్ దిల్లీ హైకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో.. డీఎన్‌ఏ వ్యాక్సిన్ రూపొందించిన జైడస్ కాడిలా 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారి కోసం క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గల జైడస్ కాడిలా సంస్థ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్.. చట్టబద్ధమైన ఆమోదం పొందేందుకు సిద్ధంగా ఉందన్నారు. త్వరలోనే ఈ వ్యాక్సిన్ చిన్నారులకు వినియోగించేందుకు అందుబాటులోకి రానున్నదని తెలిపారు.

Updated Date - 2021-07-17T11:51:59+05:30 IST