హైవేపై రూ.4.71కోట్లతో సెంట్రల్‌ లైటింగ్‌

ABN , First Publish Date - 2022-01-20T05:14:59+05:30 IST

హైవేపై రూ.4.71కోట్లతో సెంట్రల్‌ లైటింగ్‌

హైవేపై రూ.4.71కోట్లతో సెంట్రల్‌ లైటింగ్‌
కందుకూరులో హైదరాబాద్‌-శ్రీశైలం రహదారిపై డివైడర్‌ను పరిశీలిస్తున్న తల్లోజు ఆచారి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, అధికారులు

  • హైదరాబాద్‌-శ్రీశైలం రహదారి అభివృద్ధి
  • జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి 
  • రహదారి వెంట పర్యటన

ఆమనగల్లు/కందుకూరు: హైదరాబాద్‌-శ్రీశైలం రహదారిపై సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్‌, ఫు ట్‌పాత్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.4.71కోట్లు మంజూరు చేసిందని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజుఆచారి తెలిపారు. జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయని పేర్కొన్నారు. వారంరోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. బుధవారం ఆయన ఆమనగల్లు, కందుకూరు మండలాల్లో పర్యటించా రు. ఆమనగల్లులో రాజీవ్‌ కూడలి వద్ద రూ.90లక్షలతో ఏర్పాటు చేసే జంక్షన్‌ను ఎన్‌హెచ్‌ క్వాలిటీ కన్సల్టెంట్‌ గంగాధర్‌, కాంట్రాక్టర్‌ సంజయ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌, వైస్‌చైర్మన్‌ దుర్గయ్యతో కలిసి పరిశీలించారు. నాలుగైదు జిల్లాలను కలిపే ఈ కీలక హైవేపై ప్ర మాదాల నివారణకు హైవేస్‌ అథారిటీ చర్యలు తీసుకుంటోందన్నారు. కందుకూరు, కడ్తాల్‌, మైసిగండి, విఠాయిపల్లి, ఆమనగల్లు, వెల్దండ, కొట్ర, డిండి వద్ద సెంట్రల్‌ లైటి ంగ్‌, డివైడర్లు, పాదచరులకు రక్షణ కంచెలు ఏర్పాటు చేస్తామని ఆచారి వివరించారు.హైదరాబాద్‌-శ్రీశైలం రహదారిని నాలుగు లేన్లుగా, నాగార్జున సాగర్‌ రహదారి నుంచి మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, కేశంపేట, షాద్‌నగర్‌ రహదారిని మూడులేన్ల రోడ్డుగా చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కోరడంతో ఆయన స్పందించారన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో రూ.1,600కోట్లతో హైవేల నిర్మాణం జరుగుతోందన్నారు. కందుకూరులో హైవే నిర్మించినప్పటి నుంచి పాత రైస్‌మిల్లు వద్ద వర్షపు నీరు నిలిచి ప్రయాణికులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆచారికి తెలిపారు. హైవేకు ఇరువైపు లా కొత్తూరు వాగు వరకు డ్రైనేజీకి నిధు లుమంజూరు చేయాలని కోరారు. ఆయన స్పందించి కొత్తూరువాగు వరకు డ్రైనే జీ నిర్మాణానికి ప్రతిపాదనలు తనకు ఇవ్వాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.కార్యక్రమాల్లో కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తుమ్మేటి వెంకట్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శేఖ ర్‌రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు లక్ష్మణ్‌, చె న్నకేశవులు, విజయ్‌కృష్ణ, విక్రంరెడ్డి, శ్రీకాంత్‌సింగ్‌, శ్రీశైలం యాదవ్‌, నర్సింహ, విష్ణు, శ్రీను, మన్య, శంకర్‌, డి.మహేశ్‌, భగీరథ్‌, ప్రేమ్‌నాయక్‌, చందన్‌, పరమేశ్‌ కందుకూరు మాజీ ఎంపీపీ, బీజేపీ కందుకూరు అధ్యక్షుడు అనేగౌని అశోక్‌గౌడ్‌, లక్ష్మణ్‌, పల్లె కృష్ణాగౌడ్‌, కొత్తగూడ సర్పంచ్‌ సాధ మల్లారెడ్డి, కందుకూరు నాయకులు అంజిరెడ్డి, మహేందర్‌, సత్యనారాయణరెడ్డి, సత్తిరెడ్డి, భూమిరెడ్డి, జి.వెంకట్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, వరుణ్‌, దినేష్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T05:14:59+05:30 IST