ఏపీ ప్రభుత్వం ఘోర తప్పిదం.. పార్లమెంట్‌లో ఊహించని షాక్

ABN , First Publish Date - 2021-12-04T23:39:35+05:30 IST

రాయలసీమను వరదలు ముంచెత్తిన తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు కింది గ్రామాలు మునిసిపోయాక వారం రోజులకు...

ఏపీ ప్రభుత్వం ఘోర తప్పిదం.. పార్లమెంట్‌లో ఊహించని షాక్

అమరావతి: రాయలసీమను వరదలు ముంచెత్తిన తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు కింది గ్రామాలు మునిసిపోయాక వారం రోజులకు సీఎం జగన్ టూర్ ప్లాన్ చేశారు. పరామర్శల కన్నా సెల్ఫీలకే ప్రాధాన్యతనిచ్చారు. సరిగ్గా అదే సమయంలో పార్లమెంట్‌లో ఊహించని షాక్ తగిలింది. అసెంబ్లీలో జగన్ చేసిన ప్రకటన నిర్వీర్యమైపోయింది. చంద్రబాబు విశ్లేషణ నిజమైంది. చంద్రబాబు డిమాండ్‌కు బలం చేకూరింది. 


వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరించినా ఏపీ సర్కార్ స్పందించలేదు. వరదలపై సంకేతాలు వచ్చినా అవసరమైన చర్యలు తీసుకోలేదు. ఫలితంగా అన్నమయ్య ప్రాజెక్టు ప్రమాదంలో ఊళ్లకు ఊళ్లే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలువురి ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. కానీ ఆ తర్వాత కూడా జగన్ సర్కార్ ప్రకృతిపై నెపం నెట్టే ప్రయత్నం చేసింది. కానీ కేంద్రమంత్రి నేరుగా తలంటింది. పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ప్రభుత్వం అలసత్వాన్ని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిలదీశారు. 




Updated Date - 2021-12-04T23:39:35+05:30 IST